మెయిన్‌ డ్రాకు చేరువలో యుకీ | Stepanek top seed in Australian Open men's qualifying | Sakshi
Sakshi News home page

మెయిన్‌ డ్రాకు చేరువలో యుకీ

Jan 13 2017 12:38 AM | Updated on Sep 5 2017 1:06 AM

భారత ఆటగాడు యూకీ బాంబ్రీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో ముందంజ వేశాడు.

మెల్‌బోర్న్‌: భారత ఆటగాడు యూకీ బాంబ్రీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో ముందంజ వేశాడు. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో యూకీ 6–3, 6–4తో పెడ్జా క్రిస్టిన్‌ (సెర్బియా)పై విజయం సాధించాడు. 68 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించిన యూకీ, మెయిన్‌ డ్రాకు అర్హత పొందడానికి మరో విజయం దూరంలో నిలిచాడు. చివరిదైన మూడో రౌండ్‌ పోరులో 21వ సీడ్‌ ఎర్నెస్టో ఎస్కోబెడో (అమెరికా)తో యూకీ తలపడతాడు.

Advertisement
 
Advertisement
Advertisement