నిఖత్ బానుకు రెండు టైటిల్స్ | State ranking table tennis tournament, the winner of the international player niruti nikhat Banu, | Sakshi
Sakshi News home page

నిఖత్ బానుకు రెండు టైటిల్స్

Aug 19 2013 12:47 AM | Updated on Sep 1 2017 9:54 PM

నిఖత్ బానుకు రెండు టైటిల్స్

నిఖత్ బానుకు రెండు టైటిల్స్

రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో నిరుటి విజేత అంతర్జాతీయ క్రీడాకారిణి నిఖత్ బాను యూత్, మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను నిలబెటుకుంది.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో నిరుటి విజేత అంతర్జాతీయ క్రీడాకారిణి నిఖత్ బాను యూత్, మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను నిలబెటుకుంది. గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ) ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నిఖత్ బాను 11-9, 6-11, 11-7, 11-8, 11-6 స్కోరుతో ఎం.మౌనిక (జీఎస్‌ఎం)పై విజయం సాధించింది. యూత్  బాలికల సింగిల్స్ ఫైనల్లో నిఖత్ బాను 1-11, 8-11, 11-8, 11-9, 11-7తో మౌనిక (జీఎస్‌ఎం)పై గెలిచింది. వివిధ విభాగాల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
 
 ఫైనల్స్ ఫలితాలు
  సబ్ జూనియర్ బాలుర సింగిల్స్: 1.హరికృష్ణ (ఎస్‌పీటీటీఏ), 2.ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్ (జీటీటీఏ), సబ్ జూనియర్ బాలికల సింగిల్స్: 1.నైనా (ఎల్బీ స్టేడియం), 2.కె.వి.వి.వైశాలీ (అనంతపురం). జూనియర్ బాలుర సింగిల్స్: 1.హర్ష్ లహోటి (నారాయణగూడ వైఎంసీఏ), 2.ఆలీ మహ్మమద్(ఎస్‌పీటీటీఏ). జూనియర్ బాలికల సింగిల్స్: 1.నైనా (ఎల్బీ స్టేడియం), 2.ఎం.మౌనిక (జీఎస్‌ఎం). యూత్ బాలుర సింగిల్స్: 1.హర్ష్ లహోటి(నారాయణగూడ వైఎంసీఏ), 2. పీయూష్ అగర్వాల్(ఎస్‌పీటీటీఏ). పురుషుల సింగిల్స్: 1.విఘ్నయ్‌రెడ్డి (ఎస్‌పీటీటీఏ), 2.కృష్ణ కిరిటీ (ఏజీ ఆఫీస్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement