
చివరి బంతికి బంగ్లా ఆలౌట్
ఆరంభంలో మెల్లగా ఆడినప్పటికీ బంగ్లాదేశ్ చివరకు మంచి స్కోరు సాధించింది.
కాన్ బెర్రా: ఆరంభంలో మెల్లగా ఆడినప్పటికీ బంగ్లాదేశ్ చివరకు మంచి స్కోరు సాధించింది. ముష్ఫికర్(71), షకీబ్(63) అర్థ సెంచరీలతో రాణించడంతో ప్రత్యర్థి ముందు 268 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అఫ్ఘానిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటయింది. చివరి బంతికి బంగ్లాదేశ్ ఆలౌట్ కావడం విశేషం.
షకీబ్ 51 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో 63 పరుగులు చేశాడు. ముష్ఫికర్ 56 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో 71 పరుగులు సాధించాడు. వీరిద్దరూ 5వ వికెట్ కు 88 బంతుల్లో 100 పరుగులు జోడించారు. అనాముల్ హక్ 29, తమిమ్ ఇక్బాల్ 19, సౌమ్య సర్కార్ 28, మహ్మదుల్లా 23 పరుగులు చేసి అవుటయ్యారు. అఫ్ఘానిస్థాన్ బౌలర్లలో హమిద్ హాసన్, షపూర్ జాడ్రన్, ఆప్తాబ్ ఆలం, ఆష్రాఫ్ రెండేసి వికెట్లు పడ్డగొట్టారు. నబీకి ఒక వికెట్ దక్కింది.