హామిల్టన్ 'సిక్సర్'! | Lewis Hamilton storms to victory at Hockenheim after Nico Rosberg suffers horror start | Sakshi
Sakshi News home page

హామిల్టన్ 'సిక్సర్'!

Jul 31 2016 8:01 PM | Updated on Sep 4 2017 7:13 AM

హామిల్టన్ 'సిక్సర్'!

హామిల్టన్ 'సిక్సర్'!

వారం రోజుల క్రితం హంగేరీ గ్రాండ్ ప్రిలో సత్తా చాటిన ప్రపంచ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి దుమ్మురేపాడు.

హాకెన్హీమ్:వారం రోజుల క్రితం హంగేరీ గ్రాండ్ ప్రిలో సత్తా చాటిన ప్రపంచ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి దుమ్మురేపాడు. జర్మన్ గ్రాండ్ ప్రిలో భాగంగా ఆదివారం జరిగిన ప్రధాన రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ 67 ల్యాప్లను అందరికంటే వేగంగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. తద్వారా వరుసగా నాల్గో విజయాన్ని సాధించిన హామిల్టన్.. ఈ సీజన్లో ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 

ప్రధాన రేసును రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన హామిల్టన్ ఆద్యంత ఆకట్టుకున్నాడు. అయితే క్వాలిఫయింగ్ సెషన్లో పోల్ పొజిషన్ సాధించి రేసును ఆరంభించిన తన సహచర మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ నాల్గో స్థానానికి పరిమితమై సొంత ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచాడు. కాగా, రెడ్ బుల్ కు చెందిన డానియల్ రికియార్డో, మాక్స్ వెర్స్టాపెన్లు పొడియం పొజిషన్ సాధించారు. ఈ రేసులో రికియార్డో రెండో స్థానంలో, వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలవడం విశేషం. గత హంగేరి గ్రాండ్ ప్రితో ఈ సీజన్ లో తొలిసారి డ్రైవర్ల పాయింట్ల పట్టికలో ముందంజలోకి వచ్చిన హామిల్టన్..తాజా రేసులో విజయం సాధించిన అనంతరం 19 పాయింట్ల ఆధిక్యం సాధించి రోస్ బర్గ్ ను మరింత వెనక్కినెట్టాడు. ఇది జర్మన్ గ్రాండ్ ప్రిలో హామిల్టన్ కు మూడో విజయం కాగా, ఓవరాల్ కెరీర్లో 49 విజయం కావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement