నా ప్రేయసి ప్రెగ్నెంట్ : హర్దిక్‌ | Hardik Pandya Announce Natasha Pregnant | Sakshi
Sakshi News home page

నా ప్రేయసి ప్రెగ్నెంట్ : హర్దిక్‌ పాండ్యా

May 31 2020 8:14 PM | Updated on May 31 2020 8:24 PM

Hardik Pandya Announce Natasha Pregnant - Sakshi

భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా అభిమానులకు శుభవార్తను తెలిపాడు. తన ప్రేయసి నటాషా స్టాన్‌కోవిచ్‌ ప్రెగ్నెంట్ అని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ మేరకు నటాషాతో దిగిన తాజా ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్‌ ఖాతాలో ఆదివారం సాయంత్రం పోస్ట్‌ చేశాడు. తనతో జీవన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందున్నా అని, ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి, మోడల్‌ నటాషా స్టాన్‌కోవిచ్‌ను హార్దిక్‌ వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో వీరిద్దరు తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోనున్నారు. ఇక హర్దిక్‌ పోస్ట్‌కు స్పందించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రీతో పలువురు క్రికెటర్లు‌ వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement