ఆనంద్‌కు మరో డ్రా | Another draw to the Anand | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు మరో డ్రా

Sep 2 2015 3:36 AM | Updated on Sep 3 2017 8:33 AM

సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్యూ ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు

 సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్యూ ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు వరుసగా ఆరోసారి డ్రా ఎదురైంది. టోర్నీలో టాపర్‌గా ఉన్న లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో జరిగిన ఎనిమిదో రౌండ్‌లో ఆనంద్ 31 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. తొలి రెండు రౌండ్లలో పరాజయాలను ఎదుర్కొన్న ఆనంద్ ప్రస్తుతం మూడు పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇక చివరి రౌండ్‌లో తను ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఎదుర్కోనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement