రేసింగ్ చాంప్ అనిందిత్ | anindit wins racing title | Sakshi
Sakshi News home page

రేసింగ్ చాంప్ అనిందిత్

Nov 22 2016 10:57 AM | Updated on Sep 4 2017 8:49 PM

జేకే టైర్ ఎఫ్‌ఎంఎస్‌సీఐ జాతీయ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ రేసర్ అనిందిత్ రెడ్డి సత్తా చాటాడు.

సాక్షి, హైదరాబాద్: జేకే టైర్ ఎఫ్‌ఎంఎస్‌సీఐ జాతీయ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ రేసర్ అనిందిత్ రెడ్డి సత్తా చాటాడు. ఢిల్లీలోని బుధ్ సర్క్యూట్‌లో జరిగిన ఈ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో యూరో జేకే-16 విభాగంలో విజేతగా నిలిచాడు. ఆరో స్థానం నుంచి రేసును ప్రారంభించిన అనిందిత్ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించాడు.

 

చివరి వరకు తన దూకుడును కొనసాగిస్తూ 116 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విభాగంలో అనంత్ షణ్ముగమ్ (99 పాయింట్లు), నయన్ చటర్జీ (90 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మరోవైపు ఎల్‌జీబీ-4 రేసు విభాగంలో చెన్నైకి చెందిన విష్ణు ప్రసాద్ (96 పాయింట్లు) విజేతగా నిలవగా... రాహుల్ రంగస్వామి (75 పాయింట్లు), శరణ్ (54 పాయింట్లు) తర్వాతి స్థానాల్ని దక్కించుకున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement