ఐశ్వి మథాయ్‌కు స్వర్ణ పతకం | aishvi muthiah get gold medal in Junior Swimming Championship | Sakshi
Sakshi News home page

ఐశ్వి మథాయ్‌కు స్వర్ణ పతకం

Dec 11 2016 2:03 AM | Updated on Sep 4 2017 10:23 PM

ఐశ్వి మథాయ్‌కు స్వర్ణ పతకం

ఐశ్వి మథాయ్‌కు స్వర్ణ పతకం

తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా సబ్‌ జూనియర్, జూనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా అమ్మాయి ఐశ్వి మథాయ్‌ స్వర్ణ పతకాన్ని సాధించింది.

రుద్రంపూర్‌: తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా సబ్‌ జూనియర్, జూనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా అమ్మాయి ఐశ్వి మథాయ్‌ స్వర్ణ పతకాన్ని సాధించింది. గ్రూప్‌–3 బాలికల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ఐశ్వి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జి. కశ్యపి రెండో స్థానంలో నిలిచి రజతం, అరిబా అమెన్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెల్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం ఈ పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. కొత్తగూడెంలోని సీఈఆర్‌ క్లబ్‌లో జిల్లా ఎస్పీ అంబర్‌ కిషోర్‌ ఝా ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement