అమ్మో! ఎంత పెద్ద కొండచిలువ

Officials Pull Out 10 Feet Long Python Hidden In Bushes In Gujarat - Sakshi

వడోదర : గుజరాత్‌లో శనివారం 10 అడుగులున్న కొండచిలువను వైల్డ్‌లైఫ్‌ రెస్క్యూ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వడోదరకు చెందిన వ్యక్తి రోజు మాదిరిగానే శనివారం ఉదయం పొలం పనులు చూసుకునేందుకు తన ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. కాసేపటి తర్వాత ఏదో అలికిడయిన శబ్దం వినిపించడంతో చెట్ల పొదల్లోకి తొంగి చూడగా కొండచిలువ కనిపించింది. వెంటనే వైల్డ్‌ లైఫ్‌ రెస్క్యూకు సమాచారం అందించడంతో  వారు అక్కడికి చేరుకొని చెట్ల పొదలను తొలగించి 10 అడుగుల కొండచిలువను బయటికి తీశారు. తర్వాత ఆ కొండచిలువను అక్కడి అటవీ అధికారులకు అప్పజెప్పారు. కాగా,ఈ వీడియోనూ తీసిన ఒక మీడియా సంస్థ తమ ట్విటర్‌లో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top