వాట్సప్లో గ్యాంగ్ రేప్ వీడియో, మహిళ ఆత్మహత్య | Married gangrape victim commits suicide | Sakshi
Sakshi News home page

వాట్సప్లో గ్యాంగ్ రేప్ వీడియో, మహిళ ఆత్మహత్య

Jan 13 2016 1:12 PM | Updated on Nov 6 2018 7:56 PM

వాట్సప్లో గ్యాంగ్ రేప్ వీడియో, మహిళ ఆత్మహత్య - Sakshi

వాట్సప్లో గ్యాంగ్ రేప్ వీడియో, మహిళ ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది.

ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత(40)పై నలుగురు దుండగులు గ్యాంగ్ రేప్కు పాల్పడి ఆ దృష్యాలను వాట్సప్లో షేర్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ మహిళ విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ముజఫర్ నగర్ జిల్లాలోని చాప్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ముజఫర్ నగర్ ఎస్పీ ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ.. 'చాప్రా గ్రామానికి చెందిన ఓ మహిళపై ఆదివారం నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసి వాట్సప్లో షేర్ చేశారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న సదరు మహిళ విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది' అని తెలిపారు. నిందితులపై  కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపిన ఆయన దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement