జెట్ విమానం అత్యవసర లాండింగ్ | Jet Airways plane makes emergency landing in Lucknow | Sakshi
Sakshi News home page

జెట్ విమానం అత్యవసర లాండింగ్

Apr 27 2016 7:16 PM | Updated on Sep 3 2017 10:53 PM

ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జెట్ ఎయిర్వేస్కు చెందిన డెహ్రడూన్- ఢిల్లీ విమానం అత్యవసరంగా దింపేయాల్సి వచ్చింది.

లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జెట్ ఎయిర్వేస్కు చెందిన డెహ్రడూన్- ఢిల్లీ విమానం అత్యవసరంగా దింపేయాల్సి వచ్చింది. 45 మంది ప్రయాణికులతో డెహ్రడూన్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానంలో ఇందనం కొరత సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్.. జెట్ ఎయిర్వేస్ అధికారులకు సమాచారం అందించాడు.

అధికారుల సూచన మేరకు చౌదరి చారణ్ సింగ్(సీసీఎస్) విమానశ్రయంలో జెట్ విమానాన్ని అత్యవసర పరిస్థితిలో దింపేశారు. అయితే విమానంలో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారంటూ సీసీఎస్ ఎయిర్పోర్టు డైరెక్టర్ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ విలేకరులతో చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement