నేటి నుంచి ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవలు | EPFO to launch online facility to view updated accounts | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవలు

Sep 6 2013 6:18 AM | Updated on Sep 2 2018 3:34 PM

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తమ చందాదారుల సౌకర్యార్థం శుక్రవారం నుంచి ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెస్తోంది.

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తమ చందాదారుల సౌకర్యార్థం శుక్రవారం నుంచి ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా చందాదారులు ఇకపై తమ ఖాతాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకొనేందుకు వీలవుతుంది. ‘ఇప్పటివరకు వారి ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఏడాదికి ఒకసారి మాత్రమే సవరించేవాళ్లం. ఇకపై ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు ఖాతాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు’ అని ఈపీఎఫ్‌వో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జలాన్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement