సిగరెట్ కంపెనీలకు 7,903 కోట్లు జరిమానా | Cigarette companies fined 7.903 million | Sakshi
Sakshi News home page

సిగరెట్ కంపెనీలకు 7,903 కోట్లు జరిమానా

Jun 3 2015 12:56 AM | Updated on Sep 3 2017 3:07 AM

ధూమపానం ఆరోగ్యానికి హానికరమనిని హెచ్చరించనందుకు కెనడా కోర్టు సిగరెట్ కంపెనీలకు రూ.7,903 కోట్ల భారీ జరిమానా ...

అట్టావా: ధూమపానం ఆరోగ్యానికి హానికరమనిని హెచ్చరించనందుకు కెనడా కోర్టు సిగరెట్ కంపెనీలకు రూ.7,903 కోట్ల భారీ జరిమానా విధించింది. సిగరెట్ తాగటం వల్ల గొంతు, ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడిన 10 లక్షల మంది తరఫున క్యూబెక్ రాష్ట్రానికి కొందరు 1998లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు సోమవారం తుది తీర్పునిచ్చింది.

జరిమానా మొత్తాన్ని బాధితులకు నష్ట పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. కెనడా చరిత్రలోనే అతిపెద్ద జరిమానా అయిన దీనిపై పైకోర్టులో అప్పీల్ చేస్తామని ఇంపీరియల్ టొబాకో, రోత్‌మాన్స్ అండ్ హెడ్జెస్, జేటీఐ మెక్‌డొనాల్డ్  కంపెనీలు తెలిపాయి.
 
 

Advertisement
 
Advertisement
Advertisement