మురికి కాల్వలో గుర్మీత్‌ ఫోటోలు..! | angry Dera followers flush his photos down the drain | Sakshi
Sakshi News home page

మురికి కాల్వలో గుర్మీత్‌ ఫోటోలు..!

Sep 1 2017 12:49 PM | Updated on Sep 17 2017 6:15 PM

మురికి కాల్వలో గుర్మీత్‌ ఫోటోలు..!

మురికి కాల్వలో గుర్మీత్‌ ఫోటోలు..!

జైలుశిక్ష అనుభిస్తున్న గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు అభిమానలు నుంచి ఊహించని షాక్‌ ఎదురైంది.

సాక్షి, రాజస్తాన్‌​: అత్యాచారం కేసులో 20 ఏళ్ల  జైలుశిక్ష అనుభిస్తున్న డేరా సచ్ఛా సౌధా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు అభిమానలు నుంచి ఊహించని షాక్‌ ఎదురైంది. సొంత జిల్లా శ్రీగంగానగర్‌లో గుర్మీత్‌కు మింగుడు పడని సంఘటన జరిగింది. గుర్మీత్‌ను దైవంగా భావించే అభిమానులు ఆయనపై పీకలదాక కోపంతో ఉన్నారు. నమ్మిన వ్యక్తి మోసం చేశారనే కోపంతో ఆయన చిత్రపటాలను మురికి కాల్వలో పడేశారు.

వివరాల్లోకి వెళ్తే రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాకు చెందిన ,చీఫ్‌ శానిటేషన్‌ ఇన్స్పెక్టర్‌ దేవేంద్ర రాథోడ్‌ సాధారణ తనిఖీలకు వెళ్లారు. రోజు వారి తనిఖీల్లో భాగంగా మీరా చౌక్‌, సుఖాడియా సర్కిల్‌ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌  వందలాది ఫోటోలు మురికి కాల్వల్లో విసిరేసినట్లు కనిపించాయి. దీనిపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement