యుద్ధం సిద్ధం! | yudham movie ready for release | Sakshi
Sakshi News home page

యుద్ధం సిద్ధం!

Mar 2 2014 11:49 PM | Updated on Sep 2 2017 4:16 AM

యుద్ధం సిద్ధం!

యుద్ధం సిద్ధం!

తరుణ్, యామీ గౌతమ్ జంటగా రూపొందిన చిత్రం ‘యుద్ధం’. ‘ఎవరితోనైనా’ ఉపశీర్షిక. భారతీ గణేశ్ దర్శకుడు. నట్టి కుమార్, నట్టి లక్షీ్ష్మ నిర్మాతలు.


 తరుణ్, యామీ గౌతమ్ జంటగా రూపొందిన చిత్రం ‘యుద్ధం’. ‘ఎవరితోనైనా’ ఉపశీర్షిక. భారతీ గణేశ్ దర్శకుడు. నట్టి కుమార్, నట్టి లక్షీ్ష్మ నిర్మాతలు. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

 

సి.కల్యాణ్ ఆడియోసీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని జిట్టా సురేంద్రరెడ్డికి అందించారు. పాటలతో పాటు సినిమా కూడా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కుటుంబ విలువలతో కూడిన ఈ చిత్రాన్ని ఈ నెల 7న విడుదల చేస్తున్నామని నట్టికుమార్ చెప్పారు. తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని తరుణ్ నమ్మకం వ్యక్తం చేశారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుందని, ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement