ఐష్ కుమార్తె మరో హీరోను తండ్రి అనుకుని.. | When Aishwarya daughter hugged Ranbir thinking he was her dad | Sakshi
Sakshi News home page

ఐష్ కుమార్తె మరో హీరోను తండ్రి అనుకుని..

Oct 21 2016 3:00 PM | Updated on Sep 4 2017 5:54 PM

ఐష్ కుమార్తె మరో హీరోను తండ్రి అనుకుని..

ఐష్ కుమార్తె మరో హీరోను తండ్రి అనుకుని..

బాలీవుడ్ అందాలతార ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ల ముద్దుల తనయ ఆరాధ్య.. షూటింగ్ సెట్లో పొరపాటు పడిందట.

బాలీవుడ్ అందాలతార ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ల ముద్దుల తనయ ఆరాధ్య.. షూటింగ్ సెట్లో పొరపాటు పడిందట. మరో హీరో రణవీర్ కపూర్ను తన తండ్రి అభిషేక్గా భావించిన ఆరాధ్య అతని దగ్గరకు వెళ్లి కౌగిలించుకుంది. ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య ఈ విషయాన్ని చెప్పింది.

ఐశ్వర్య, రణవీర్ జంటగా ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్కు ఐశ్వర్య తన కూతురును తీసుకెళ్లింది. సెట్లో కూర్చున్న రణవీర్ను చూసిన ఆరాధ్య తన తండ్రి అనుకుని అతని దగ్గరకు వెళ్లింది. అభిషేక్ తరచూ క్యాప్ పెట్టుకుని జాకెట్ వేసుకుంటాడు. ఆ రోజు రణవీర్ కూడా అచ్చం అభిషేక్ మాదిరిగా క్యాప్ పెట్టుకుని, జాకెట్ ధరించాడు. దీంతో ఆరాధ్య పొరపాటు పడిందని,  రణవీర్ను అభిషేక్లా భావించిందని ఐశ్వర్య చెప్పింది. ఆరాధ్యకు రణవీర్ అంటే ఇష్టమని, అతనితో ఎక్కువసేపు గడిపేదని తెలిపింది.

కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఏ దిల్ హై ముష్కిల్ కష్టాల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు నటించినందున విడుదల చేయబోమని థియేటర్ల యజమానులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలపై అనిశ్చిత ఏర్పడింది. కరణ్ జోహార్ ఇటీవల కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ను కలసి సాయం కోరాడు. అంతకుముందు ప్రెస్మీట్ పెట్టి వివరణ ఇచ్చాడు. ఈ సినిమాలో రణవీర్, ఐశ్వర్య హాట్ హాట్ సన్నివేశాల్లో నటించారు. విడుదల చేసిన ఈ సినిమా స్టిల్స్లో ఐష్ హాట్గా కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement