దీపికకు అసూయగా ఉందట! | What makes Deepika Padukone jealous of Kangana Ranaut | Sakshi
Sakshi News home page

దీపికకు అసూయగా ఉందట!

Mar 10 2014 4:15 PM | Updated on Apr 3 2019 6:23 PM

దీపికకు అసూయగా ఉందట! - Sakshi

దీపికకు అసూయగా ఉందట!

దీపికకు కంగనా రనౌత్ను చూస్తే అసూయగా ఉందట. కంగనా తాజా చిత్రం క్వీన్లో ఆమె అద్భుతంగా నటించిందంటూ ప్రశంసించింది.

ముంబై: దీపిక పదుకోన్.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్. పలు సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో కలసి భారీ బడ్జెట్ చిత్రం కొచ్చాడియన్లో దర్శనమివ్వనుంది. ఇంత పాపులారిటీ ఉన్న దీపికకు కంగనా రనౌత్ను చూస్తే అసూయగా ఉందట. కంగనా తాజా చిత్రం క్వీన్లో ఆమె అద్భుతంగా నటించిందంటూ ప్రశంసించింది.

'క్వీన్ సినిమా చూశా. ఇందులో కంగన అద్భుతంగా నటించింది. కంగన నటన చూసి అసూయ కలిగింది' అని దీపిక చెప్పింది. ఈ చిత్ర దర్శకుడు వికాస్ మహిళల భావోద్వేగాలను చక్కగా తెరకెక్కించారంటూ ప్రశంసించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement