నాని సన్‌ రైజర్స్‌ టీమ్‌ తరుపున ఆడాలి : విజయ్‌ | Vijay Devarakonda Comment On Nani Jersey Movie | Sakshi
Sakshi News home page

నాని సన్‌ రైజర్స్‌ టీమ్‌ తరుపున ఆడాలి : విజయ్‌

Apr 22 2019 11:19 AM | Updated on Apr 22 2019 11:19 AM

Vijay Devarakonda Comment On Nani Jersey Movie - Sakshi

అర్జున్‌ పాత్రలో నాని అందర్నీ చేత చప్పట్లు కొట్టించగా.. నాని సన్‌రైజర్‌ టీమ్‌ తరుపున ఆడాలి అంటూ విజయ్‌ దేవరకొండ కోరారు. గత శుక్రవారం విడుదలైన జెర్సీ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు, సినీ ప్రముఖుల మన్నలను అందుకుంది. ప్రత్యేకంగా అర్జున్‌ పాత్రలో నాని ఒదిగిపోయిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పటికే అల్లు అర్జున్‌, జూ ఎన్టీఆర్‌లు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించగా.. తాజాగా విజయ్‌ దేవరకొండ  తనదైన శైలిలో స్పందించాడు.

జెర్సీ సినిమాపై సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. ‘నాని అందరీ చేత చప్పట్లు కొట్టించాడు. తన బ్యాటింగ్‌తో ఉక్కిరిబిక్కిరి చేశాడు. సినిమా చూస్తున్నంత సేపు అందులోనే లీనమైయ్యాను. నాని సన్‌రైజర్‌టీమ్‌ తరుపున ఆడాలి. వాటే స్ట్రైకింగ్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు. శ్రద్దా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement