వెరైటీ ప్రేమ! | Vijay Devarakonda as Arjun Reddy | Sakshi
Sakshi News home page

వెరైటీ ప్రేమ!

May 14 2016 12:11 AM | Updated on Sep 4 2017 12:02 AM

వెరైటీ ప్రేమ!

వెరైటీ ప్రేమ!

‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్‌తో మెప్పించిన విజయ్ దేవరకొండ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తెరకెక్కనుంది.

‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్‌తో మెప్పించిన విజయ్ దేవరకొండ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తెరకెక్కనుంది. సందీప్ దర్శకత్వంలో భద్రకాళి పిక్చర్స్‌పై ప్రణయ్ నిర్మించనున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. షాలిని కథానాయిక. ప్రారంభోత్సవం రోజునే ఫస్ట్ లుక్ విడుదల చేయడం విశేషం. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘డిఫరెంట్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీ ఇది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్. హైదరాబాద్, మంగళూర్, డెహ్రడూన్, ఢిల్లీ, ఇటలీల్లో చిత్రీకరణ జరుపుతాం’’ అని తెలిపారు. సంగీతం: రధన్, కెమేరా: నగేష్ బన్నేల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement