breaking news
Bhadrakali Pictures
-
రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు
-
వెరైటీ ప్రేమ!
‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్‌తో మెప్పించిన విజయ్ దేవరకొండ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తెరకెక్కనుంది. సందీప్ దర్శకత్వంలో భద్రకాళి పిక్చర్స్‌పై ప్రణయ్ నిర్మించనున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. షాలిని కథానాయిక. ప్రారంభోత్సవం రోజునే ఫస్ట్ లుక్ విడుదల చేయడం విశేషం. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘డిఫరెంట్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీ ఇది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్. హైదరాబాద్, మంగళూర్, డెహ్రడూన్, ఢిల్లీ, ఇటలీల్లో చిత్రీకరణ జరుపుతాం’’ అని తెలిపారు. సంగీతం: రధన్, కెమేరా: నగేష్ బన్నేల్.


