సూర్యకు విలన్గా మారిన టీవీ స్టార్ | Tvs Dhrithrashtra Became Suriyas S3 Villain | Sakshi
Sakshi News home page

సూర్యకు విలన్గా మారిన టీవీ స్టార్

Aug 28 2016 3:12 PM | Updated on Sep 4 2017 11:19 AM

సూర్యకు విలన్గా మారిన టీవీ స్టార్

సూర్యకు విలన్గా మారిన టీవీ స్టార్

తన కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ గా నిలిచిన సింగం, సింగం 2 సినిమాలకు ఇప్పుడు మూడో కొనసాగింపును రెడీ చేస్తున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పక్కా కమర్షియల్...

తన కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ గా నిలిచిన సింగం, సింగం 2 సినిమాలకు ఇప్పుడు మూడో కొనసాగింపును రెడీ చేస్తున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా స్క్రీన్ప్లే విషయంలో మరోసారి తన మ్యాజిక్ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు దర్శకుడు హరి.

ఇక హీరోయిజాన్ని ఎలివేట్ చేయటం కోసం తన సినిమాలో విలన్ పాత్రను చాలా పవర్ఫుల్గా చూపిస్తాడు దర్శకుడు హరి. అందుకు తగ్గట్టుగా సింగం తొలి భాగంలో ప్రకాష్ రాజ్ను, తరువాత సింగం 2లో లండన్ నటుడు డానీ సపానీని ఎంచుకున్న హరి.. ఈ సారి సింగం 3 కోసం ఓ నార్త్ టివి స్టార్ను ఎంపిక చేసుకున్నాడు.

ఇటీవల హిందీలో ఘన విజయం సాధించిన మహాభారత్ సీరియల్లో ధృతరాష్ట్రుడిగా నటించిన థాకూర్ అనూప్ సింగ్ను సూర్యకు ప్రతినాయకుడిగా సెలెక్ట్ చేశాడు. దీపావళికి రిలీజ్ కానున్న సింగం 3 తనకు వెండితెర మీద కూడా బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు అనూప్. గ్రీకు వీరుడి లాంటి ఫిజిక్తో ఆకట్టుకుంటున్న అనూప్ సింగ్, సౌత్తో పాటూ నార్త్లోనూ వెండితెర అరంగేట్రం చేయనున్నాడు. విద్యుత్ జమాల్ హీరోగా తెరకెక్కుతున్న కమాండో 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు అనూప్.

Advertisement
 
Advertisement
Advertisement