సూర్య స్టైల్లో '24' | suriya, vikram kumars 24 official teaser | Sakshi
Sakshi News home page

సూర్య స్టైల్లో '24'

Mar 5 2016 8:52 AM | Updated on Sep 3 2017 7:04 PM

సూర్య స్టైల్లో '24'

సూర్య స్టైల్లో '24'

సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలకు రెడీగా ఉండే స్టార్ హీరో సూర్య, మరోసారి అదే ఫార్ములాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కిన 24 సినిమాతో మరోసారి...

సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలకు రెడీగా ఉండే స్టార్ హీరో సూర్య. మరోసారి అదే ఫార్ములాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కిన '24' సినిమాతో మరోసారి అభిమానులకు షాక్ ఇవ్వనున్నాడు. 5 వేరియేషన్స్లో త్రిపాత్రాభినయం చేస్తున్న సూర్య ఈ సినిమాతో మరోసారి భారీ హిట్ మీద కన్నేశాడు. మనం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్రమ్ కుమార్,  ఈ సినిమాతో అదే ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు.

శుక్రవారం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుంది. కవల సోదరులుగా నటిస్తున్న సూర్య ఒక పాత్రలో సైంటిస్ట్గా, మరో పాత్రలో విలన్ ఆత్రేయగా కనిపిస్తున్నాడు. సూర్య చేసిన రిస్కీ ఫైట్స్, సూర్య గెటప్స్తో పాటు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా టీజర్ రేంజ్ను పెంచింది. సినిమా కాన్సెప్ట్ను ఫస్ట్ టీజర్లోనే రిలీజ్ చేసిన దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమాను మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement