హరితో సినిమా.. సింగం కాదు | Suriya To Reunite With Director Hari For fresh film | Sakshi
Sakshi News home page

హరితో సినిమా.. సింగం కాదు

Apr 26 2017 10:55 AM | Updated on Sep 5 2017 9:46 AM

హరితో సినిమా.. సింగం కాదు

హరితో సినిమా.. సింగం కాదు

కోలీవుడ్, టాలీవుడ్ లలో సూపర్ హిట్ నిలిచిన యాక్షన్ సీరీస్ సింగం. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సీరీస్ లో మూడు భాగాలు

కోలీవుడ్, టాలీవుడ్ లలో సూపర్ హిట్ నిలిచిన యాక్షన్ సీరీస్ సింగం. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సీరీస్ లో మూడు భాగాలు రిలీజ్ అయ్యాయి. అయితే తొలి రెండు భాగాలు ఘనవిజయం సాధించినా.. మూడో సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే సినిమా రిలీజ్ సమయంలో సింగం సీరీస్ తరువాత కూడా కొనసాగుతుందని ప్రకటించాడు హరి.

తాజాగా హరి దర్శకత్వంలో సూర్య మరో సినిమా చేయబోతున్నాడన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఫ్యాన్స్.. సూర్య, హరి కాంబినేషన్ అంటే అది సింగం సీరీస్ లోని సినిమానే అయిఉంటుందని భావించారు. కానీ సూర్యతో హరి చేయబోయే నెక్ట్స్ సినిమా సింగం  సీరీస్ కు కొనసాగింపు కాదని తెలుస్తోంది. సూర్య కోసం ఫ్రెష్ గా ఓ మాస్ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు హరి.

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న విఘ్నేష్ శివన్ సినిమా, ఆ తరువాత సెల్వరాఘవన్ ల సినిమాలు పూర్తి చేసిన తరువాత హరి దర్శకత్వంలో సూర్య సినిమా తెరకెక్కనుంది. సూర్య హీరోగా హరి కొత్త కథతో సినిమా చేస్తుండటంతో సింగం సీరీస్ కు తెరపడినట్టేనని భావిస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement
 
Advertisement
Advertisement