న్యూలుక్‌లో సూర్య | Suriya Role In His 37th Movie Revealed | Sakshi
Sakshi News home page

Sep 15 2018 11:26 AM | Updated on Sep 15 2018 11:26 AM

Suriya Role In His 37th Movie Revealed - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య ప్రస్తుతం కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో తన 37వ సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్యతో పాటు మాలీవుడ్‌ సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్‌, తమిళ యంగ్ హీరో ఆర్య, బాలీవుడ్‌ సీనియర్‌ యాక్టర్‌ బొమన్‌ ఇరానీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల లండన్‌ షూట్‌ ముంగించుకొని వచ్చిన చిత్రయూనిట్ ప్రస్తుతం చెన్నై సెకండ్‌ షెడ్యూల్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

తాజాగా ఈసినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో సూర్య కమాండోగా కనిపించనున్నాడు. కేవీ ఆనంద్‌ స్టైల్‌లో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్‌ ఫేం సయేషా సైగల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు హారిస్‌ జయరాజ్‌ సంగీతమందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement