మైండ్‌ గేమ్‌ | Super Sketch Movie Press Meet | Sakshi
Sakshi News home page

మైండ్‌ గేమ్‌

Jun 12 2018 12:26 AM | Updated on Jun 12 2018 12:26 AM

Super Sketch Movie Press Meet  - Sakshi

సోఫియా, నర్సింగ్‌ మక్కల

‘శ్రీమన్నారాయణ, సామాన్యుడు, దగ్గరగా దూరంగా, విక్టరీ, ప్యార్‌ మే పడిపోయానే, ది ఎండ్‌’..  వంటి చిత్రాలు తెరకెక్కించిన రవి చావలి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సూపర్‌ స్కెచ్‌’. నర్సింగ్‌ మక్కల, ఇంద్ర, సమీర్‌ దత్, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్‌ టోనీ (ఇంగ్లాండ్‌) ముఖ్య తారలు.

యు అండ్‌ ఐ– ఫ్రెండ్స్‌ ఫిల్మ్‌ అకాడమీ సహకారంతో బలరామ్‌ మక్కల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. బలరామ్‌ మాట్లాడుతూ– ‘‘జస్టిస్‌ ఈజ్‌ ఇన్‌ యాక్షన్‌ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా మైండ్‌ గేమ్‌తో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌. ‘సూపర్‌ స్కెచ్‌’ టైటిల్‌ కథకు చక్కగా సరిపోతుంది. తొలి కాపీ సిద్ధమైంది. మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. రవి చావలి కెరీర్‌లో మరో హిట్‌ చిత్రం ఖాయం. సురేందర్‌ రెడ్డి ఛాయాగ్రహణం, కార్తీక్‌ కొడకండ్ల సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement