సమయం వచ్చినపుడు చెప్తా : శ్రీదేవి | sridevi on baahubali | Sakshi
Sakshi News home page

సమయం వచ్చినపుడు చెప్తా : శ్రీదేవి

Jun 3 2017 1:28 PM | Updated on Sep 5 2017 12:44 PM

సమయం వచ్చినపుడు చెప్తా : శ్రీదేవి

సమయం వచ్చినపుడు చెప్తా : శ్రీదేవి

ప్రస్తుతం ఇండియన్ సినిమాకు బాహుబలి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. సౌత్ సినిమాగా తెరకెక్కిన బాహుబలి బాలీవుడ్

ప్రస్తుతం ఇండియన్ సినిమాకు బాహుబలి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. సౌత్ సినిమాగా తెరకెక్కిన బాహుబలి బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తూ సంచలనాలు నమోదు చేస్తోంది. స్ట్రయిట్ హిందీ సినిమాలకు కూడా సాధ్యం కాని ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకున్న బాహుబలిపై పలువురు బాలీవుడ్ దిగ్గజాలు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఈ సినిమాపై స్పందించేందుకు ఇప్పటికీ మొహం చాటేస్తున్నారు.

ప్రస్తుతం మామ్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న బాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రీదేవి కూడా బాహుబలిపై ఇదే విదంగా స్పందించింది. మామ్ ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన శ్రీదేవికి శివగామి పాత్రను ఎందుకు వదులుకున్నారన్న ప్రశ్న ఎదురైంది. అయితే శ్రీ దేవి మాత్రం ఈ విషయం పై స్పందించేందుకు ఇష్టపడలేదు. సమయం వచ్చినప్పుడు సమాధానం చెపుతాను ప్రస్తుతానికి నో కామెంట్ అంటూ సరిపెట్టేసింది. ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో శ్రీదేవి శివగామి పాత్రను వదులుకోవటమే హాట్ టాపిక్ గా ఉంది. దీంతో ముందు ముందు కూడా అతిలోక సుందరికి ఇవే ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement