నాలుగు భాషల్లో శ్రీదేవి కొత్త సినిమా | sridevi mom will be released in four languages | Sakshi
Sakshi News home page

నాలుగు భాషల్లో శ్రీదేవి కొత్త సినిమా

May 11 2017 1:49 PM | Updated on Sep 5 2017 10:56 AM

నాలుగు భాషల్లో శ్రీదేవి కొత్త సినిమా

నాలుగు భాషల్లో శ్రీదేవి కొత్త సినిమా

రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్న అతిలోకసుందరి శ్రీదేవి, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్

రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్న అతిలోకసుందరి శ్రీదేవి, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంగ్లీష్ వింగ్లీష్తో పరవాలేదనిపించిన ఈ బ్యూటి, తరువాత సౌత్ సినిమా పులితో నిరాశపరిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని మామ్ మూవీతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతోంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రవి వడయార్ దర్శకుడు.

శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్లోనూ శ్రీదేవికి భారీ ఫాలోయింగ్ ఉండటంతో హిందీ, తెలుగు, తమిళ్తో పాటు మలయాళంలోనూ మామ్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి మొత్తం నాలుగు ఒకేసారి జూలై 7న సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. శ్రీదేవి లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో నవాజుద్ధీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, అభిమన్యూ సింగ్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement