ఆ మూవీకి రవితేజ 'ఫిదా'! | Secret Superstar is an honest and brilliant film, tweets Ravi Teja | Sakshi
Sakshi News home page

ఆ మూవీకి రవితేజ 'ఫిదా'!

Oct 27 2017 4:56 PM | Updated on Oct 27 2017 5:24 PM

Secret Superstar is an honest and brilliant film, tweets Ravi Teja

సాక్షి, హైదరాబాద్ : 'రాజా ది గ్రేట్' మూవీతో మరో సక్సెస్ అందుకున్న టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ ఓ బాలీవుడ్ మూవీని ప్రశంసల్లో ముంచెత్తారు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ ఖాన్‌ లేటెస్ట్ మూవీ 'సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌'ను తాను నిన్న చూశానని మూవీ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా రవితేజ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.

'సీక్రెట్ సూపర్ స్టార్' చూశాను. నిజాయితీతో కూడిన గొప్ప సినిమా ఇది. అందరూ ఈ మూవీని ప్రేమిస్తారు. జైరా వసీంతో పాటు అందులో కీలకపాత్రల్లో నటించిన వారి ఫెర్మార్మెన్స్ చాలా బాగుంది. దర్శకుడు అద్వైత్ చందన్ తెలివితేటల్ని మనం గుర్తించాలి. టాలెంట్, కఠోరశ్రమ ఉంటే ఇలాంటి ప్రయత్నాల్ని ప్రపంచం కచ్చితంగా గుర్తిస్తుంది. అలాంటి మూవీలు విజయాన్ని సాధిస్తాయని' సీక్రెట్ సూపర్‌స్టార్ యాష్ స్టాగ్‌తో వరుస ట్వీట్లు చేశారు హీరో రవితేజ.

గాయనిగా ఎదగాలనుకుంటున్న ఓ ముస్లిం బాలిక కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎదుర్కొన్న అడ్డంకులు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాకు అద్వైత్ చౌహాన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడిగా నటిస్తున్న ఆమిర్‌ స్వయంగా ఆమిర్‌ ఖాణ్‌ ప్రోడక్షన్స్‌ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మించారు. జైరా వసీం ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement