సరైనోడు మొదలెట్టేశాడు | Sarrainodu Blockbuster Song Teaser | Sakshi
Sakshi News home page

సరైనోడు మొదలెట్టేశాడు

Mar 26 2016 12:51 PM | Updated on Sep 3 2017 8:38 PM

సరైనోడు మొదలెట్టేశాడు

సరైనోడు మొదలెట్టేశాడు

సమ్మర్ బరిలో పోటీపడుతున్న హీరోలు ఒక్కొక్కరుగా ప్రమోషన్ వేగం పెంచుతున్నారు. వేసవి బాక్సాఫీస్ను ఓపెన్ చేసిన నాగార్జున మంచి హిట్తో స్వాగతం పలకగా, త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న...

సమ్మర్ బరిలో పోటీ పడుతున్న హీరోలు ఒక్కొక్కరుగా ప్రమోషన్ వేగం పెంచుతున్నారు. వేసవి బాక్సాఫీస్ను ఓపెన్ చేసిన నాగార్జున మంచి హిట్తో స్వాగతం పలకగా,  త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సర్దార్ గబ్బర్సింగ్ చిత్రయూనిట్ కూడా భారీగానే  ప్రచారం చేస్తోంది. ఆడియో ఫంక్షన్ గ్రాండ్‌గా నిర్వహించిన చిత్రయూనిట్, ప్రస్తుతం టీవీ ప్రమోషన్ల మీద దృష్టిపెట్టింది. ఇదే బాటలో సమ్మర్ బరిలో రిలీజ్కు రెడీ అవుతున్న సరైనోడు కూడా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టేశాడు.

ఇప్పటికే ఫస్ట్ లుక్ ట్రైలర్తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ను కూడా రిలీజ్ చేసిన బన్నీ గ్యాంగ్, తాజాగా ఓ సాంగ్ వీడియోను రిలీజ్ చేసింది. మాస్ మాసాలా ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఐటమ్ నంబర్ను అభిమానుల కోసం తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాడు అల్లు అర్జున్. ఈ పాటలో ఆడిపాడిన తెలుగుమ్మాయి అంజలి అందాలు ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సరైనోడు సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో అందాల భామ కేథరిన్ థెరిస్సా కీలక పాత్రలో నటిస్తోంది. చాలా కాలం తరువాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో సరైనోడు సినిమా పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement