స్పెషల్ స్టోరీ దొరికేసింది!. | Samantha Bee's 'A Very Special Full Frontal Special' | Sakshi
Sakshi News home page

స్పెషల్ స్టోరీ దొరికేసింది!.

Aug 20 2016 11:29 PM | Updated on Sep 4 2017 10:06 AM

స్పెషల్ స్టోరీ దొరికేసింది!.

స్పెషల్ స్టోరీ దొరికేసింది!.

తెలుగులో పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్... తమిళంలో సూర్య, విజయ్, విక్రమ్.. ఇలా దాదాపు స్టార్ హీరోలతోనే

తెలుగులో పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్... తమిళంలో సూర్య, విజయ్, విక్రమ్.. ఇలా దాదాపు స్టార్ హీరోలతోనే సమంత జోడీ కట్టారు. కథ, పాత్ర నచ్చితే కొత్త హీరోల సరసన కూడా నటిస్తారు. అందుకు ఉదాహరణ ‘అల్లుడు శీను’. తాజాగా అప్‌కమింగ్ హీరో శివకార్తికేయన్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ‘అ ఆ’ విడుదల తర్వాత సమంత ఇప్పటివరకూ మరో సినిమాకి సంతకం చేయలేదు. ఎందుకీ గ్యాప్? అని అడిగితే.. ‘‘ఈ మధ్య నేను చేసిన తమిళ ‘తెరి’, ‘24’, ‘అ ఆ’ సినిమాల కంటే నేను కమిట్ అయ్యే తాజా సినిమా చాలా స్పెషల్‌గా ఉండాలని కోరుకుంటున్నాను.

స్పెషల్ స్టోరీ దొరకడం చాలా కష్టం’’ అన్నారు. సమంత కోరుకున్న స్పెషల్ స్టోరీ ఆమెను వెతుక్కుంటూ వచ్చినట్టుంది. అందుకే ఒప్పుకున్నారు. కమెడియన్ నుంచి హీరోగా ఎదిగిన తమిళ నటుడు శివ కార్తికేయన్ పక్కన హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించారు. వాస్తవానికి  అతనికి జోడీగా సమంత నటించనుందనే వార్త ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. ఇప్పుడు దర్శక-నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

వీవీఎస్ పొన్‌రామ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని 24ఏఎమ్ స్టూడియోస్ నిర్మించనుంది. శివ కార్తికేయన్, పొన్‌రామ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ ఇద్దరూ చేసిన గత రెండు సినిమాలు మంచి హిట్టయ్యాయి. సమంత చేరికతో ఈ సినిమాకు క్రేజ్ నెలకొంది. తెలుగులో ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‌గా నటించిన ‘జనతా గ్యారేజ్’ వచ్చే నెలలో విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement