2.ఓ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్..! | Rajinikanth 2.o teaser release Date | Sakshi
Sakshi News home page

Jan 4 2018 10:50 AM | Updated on Jan 4 2018 11:04 AM

Rajinikanth 2.o teaser release Date - Sakshi

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. గతంలో రజనీ, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందింన రోబో సినిమాకు సీక్వల్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతీనాయక పాత్రలో నటిస్తున్నారు. బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. శంకర్ అత్యున్నత సాంకేతిక విలువలతో పూర్తిస్థాయి  త్రీడి చిత్రంగా 2.ఓను రూపొందిస్తున్నారు.

దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది చిత్రయూనిట్. అందులో భాగంగా జనవరి 6న చిత్ర టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో టీజర్ రిలీజ్ చేయనున్నారన్న ప‍్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement