ఇండియా అబ్బాయి.. పాకిస్తాన్ అమ్మాయి..! | Puri planning Hindu Muslim Love story for his son Akash | Sakshi
Sakshi News home page

ఇండియా అబ్బాయి.. పాకిస్తాన్ అమ్మాయి..!

Sep 6 2017 1:09 PM | Updated on Mar 22 2019 1:53 PM

ఇండియా అబ్బాయి.. పాకిస్తాన్ అమ్మాయి..! - Sakshi

ఇండియా అబ్బాయి.. పాకిస్తాన్ అమ్మాయి..!

ఇటీవల వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో పడ్డ దర్శకుడు పూరి జగన్నాథ్, పైసా వసూల్ సినిమాతో పరవాలేదనిపించాడు.

ఇటీవల వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో పడ్డ దర్శకుడు పూరి జగన్నాథ్, పైసా వసూల్ సినిమాతో పరవాలేదనిపించాడు. మరోసారి రోటీన్ కథతో నిరాశపరిచినా నందమూరి బాలకృష్ణను సరికొత్తగా చూపించి అభిమానులను మెప్పించాడు. పైసా వసూల్ తరువాత ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేయని పూరి, త్వరలోనే తన కొడుకు ఆకాష్ హీరోగా ఓ సినిమాను స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడట.

అయితే మాస్ యాక్షన్ సినిమాలతో బోర్ కొట్టించిన పూరి కొడుకు రీలాంచ్ కోసం రూట్ మారుస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం, ఇడియట్, శివమణి లాంటి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీలతో అలరించిన పూరి మరోసారి అదే తరహా సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇండియా అబ్బాయి, పాకిస్తాన్ అమ్మాయిల మధ్య ప్రేమ కథతో తన ఆకాష్ ను రీలాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement