వైరల్‌ : సాహోలో ప్రభాస్‌ | Prabhas Look In Saaho | Sakshi
Sakshi News home page

May 1 2018 1:44 PM | Updated on May 1 2018 4:48 PM

Prabhas Look In Saaho - Sakshi

సాహో షూటింగ్‌లో ప్రభాస్‌

బాహుబలి లాంటి ఘన విజయం తరువాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సినిమా సాహో. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ భారీ యాక్షన్‌ సీన్స్‌ ను చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్‌. తాజా ఈ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్‌లో బైక్‌ మీద కూర్చున్న స్టిల్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

ఇప్పటి వరకు చిత్రయూనిట్ సాహోలో ప్రభాస్‌ లుక్‌ కు సంబంధించి ఎలాంటి స్టిల్‌ రిలీజ్ చేయకపోవటంతో రెబల్‌ స్టార్‌ అభిమానులు లీకైన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement