'పైసా వసూల్' అయ్యింది..! | Paisa Vasools day One collections | Sakshi
Sakshi News home page

'పైసా వసూల్' అయ్యింది..!

Sep 2 2017 3:12 PM | Updated on Aug 29 2018 1:59 PM

'పైసా వసూల్' అయ్యింది..! - Sakshi

'పైసా వసూల్' అయ్యింది..!

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పైసా వసూల్.

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పైసా వసూల్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో వచ్చాయి. పూరి, బాలయ్యల కాంబినేషన్ పై భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో పాటు టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావటంతో బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది పైసా వసూల్.

తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 12 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది పైసా వసూల్. బాలయ్య సరసన అందాల భామలు శ్రియ, ముస్కాన్, కైరా దత్ లు నటించిన ఈ సినిమాలో విక్రమ్ జీత్ ప్రతినాయకుడిగా కనిపించాడు. అనూప్ రుబెన్స్ సంగీతమందించాడు. శనివారం కూడా మంచి వసూళ్లు నమోదవుతుండటంతో తొలి వారాంతానికి పైసా వసూల్ భారీ వసూళ్లు నమోదు చేస్తుందని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement