ఈ హీరో ఏంచేశాడో చూడండి!! | OMG! What Is Varun Dhawan Doing With Jacqueline Fernandez In Public | Sakshi
Sakshi News home page

ఈ హీరో ఏంచేశాడో చూడండి!!

Jun 8 2016 4:45 PM | Updated on Sep 4 2017 2:00 AM

ఈ హీరో ఏంచేశాడో చూడండి!!

ఈ హీరో ఏంచేశాడో చూడండి!!

ప్రచార చిత్రం విడుదల సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాడెజ్ చేసిన చిలిపి పనులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్ సినిమా 'డిష్యూమ్' ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ప్రచార చిత్రం విడుదల సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాడెజ్ చేసిన చిలిపి పనులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో జాన్ అబ్రహం, వరుణ్ ధావన్ తో కలిసి జాక్వెలైన్ పాల్గొంది.

వెరైటీ డ్రెస్సులో వేదికపైకి వచ్చిన అందాల భామ వరుణ్ తో కలిసి అల్లరి చేసింది. అతడిని చేయి పట్టుకుని లాక్కుపోయింది. తర్వాత ఆమెను వరుణ్ చేయి పట్టి లాగాడు. ఆ తర్వాత ఆమెను వెనుక నుంచి తోస్తున్నట్టుగా నటించాడు. భయపడినట్టుగా నటించి వెంటనే తన మోచేయితో అతడిని డొక్కలో ఒక్క గుద్దు గుద్దినట్టు నటించి నవ్వులు పూయించింది. తర్వాత వారిద్దరూ వేదిక దిగివెళ్లిపోయారు.

సినిమా ప్రమోషన్ కోసం వీరు చేసిన ఫిట్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వరుణ్ సోదరుడు రోహిత్ దర్శకత్వం వహించిన 'డిష్యూమ్' జూలై 29న ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement