ఈ ప్రశ్నలేంటిరా బాబూ! | oh what a questions! | Sakshi
Sakshi News home page

ఈ ప్రశ్నలేంటిరా బాబూ!

Mar 22 2015 11:39 PM | Updated on Sep 5 2018 9:45 PM

ఈ ప్రశ్నలేంటిరా బాబూ! - Sakshi

ఈ ప్రశ్నలేంటిరా బాబూ!

అస్తమానం అడిగిందే అడిగుతుంటే మొదట బోర్ కొడుతుంది. ఆపై ఆ అడిగినవారినీ ఏదో చేయాలన్నంత కోపం వస్తుంది. కామన్ మ్యానే కాదు...

అస్తమానం అడిగిందే అడిగుతుంటే మొదట బోర్ కొడుతుంది. ఆపై ఆ అడిగినవారినీ ఏదో చేయాలన్నంత కోపం వస్తుంది. కామన్ మ్యానే కాదు... నలుగురిలో తిరిగే సెలబ్రిటీలకైనా ఈ టెంపర్‌మెంట్‌లో పెద్దగా తేడా ఉండదని చూపించింది హాలీవుడ్ హాట్ బ్యూటీ లిలీ జేమ్స్. వాల్డ్ డిస్నీ పిక్చర్స్ ‘సిండెరెల్లా’లో నటించిన ఈ స్వీటీ ఒంపుసొంపులపై ఇప్పటికే విపరీతమైన చర్చలు నడిచాయి. ప్రత్యేకించి ఈ చిన్నదాని చిట్టి నడుముపై ఎందరో మనసు పారేసుకున్నారు కూడా.

రీసెంట్‌గా ‘సిండెరెల్లా’ ప్రమోషన్ టూర్‌కు వెళ్లిన ఈ బ్రిటీష్ బ్యూటీకి మళ్లీ అదే ప్రశ్న ఎదురైంది... మీ సూపర్ ఫిగర్ సీక్రెట్ ఏంటని! దెబ్బకు చిర్రెత్తిన అమ్మడు... ‘నా బాడీపై ఇక ప్రశ్నలు ఆపండి. వినివిని అలసిపోయా. మహిళలను ఎప్పుడూ అదే దృష్టితో చూస్తారెందుకు’ అంటూ ఫైరైపోయింది సదరు ఔత్సాహికులపై!

Advertisement
 
Advertisement
Advertisement