మెంటల్‌ మొదలైంది | mental kya hai movie shootong started | Sakshi
Sakshi News home page

మెంటల్‌ మొదలైంది

May 13 2018 1:48 AM | Updated on Aug 21 2019 10:25 AM

mental kya hai movie shootong started - Sakshi

కింద ఉన్న ఫొటో చూసి, హెడ్డింగ్‌ చదివి తప్పుగా అర్థం చేసుకోకండి. మెంటల్‌ స్టార్ట్‌ అయ్యింది సినిమాలో. రాజ్‌కుమార్‌ రావ్, కంగనా రనౌత్‌ ముఖ్య తారలుగా ప్రకాశ్‌ కొవెలముడి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘మెంటల్‌ హై క్యా’. ఏక్తా కపూర్, శోభా కపూర్, శైలేష్‌ ఆర్‌. సింగ్‌ నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్‌ శనివారం మొదలైంది.

‘‘గో..మెంటల్‌’...‘మెంటల్‌ హై క్యా’ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది’’అని పేర్కొన్నారు నిర్మాత శైలేష్‌. నాలుగేళ్ల తర్వాత రాజ్‌ కుమార్, కంగనా కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ ఇద్దరు కలిసి ‘క్వీన్‌’ సినిమాలో నటించారు. మరోవైపు వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితం ఆధారంగా కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ చేసిన సినిమా ‘మణికర్ణిక: ద క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‌) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్‌ కానుందని బీటౌన్‌ టాక్‌. ఈ సంగతి ఇలా ఉంచితే... 71వ కాన్స్‌ వేడుకల్లో కంగనా తొలిసారి పాల్గొన్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement