హీరో తల్లిగా మీనా..! | Meena In Mother Role | Sakshi
Sakshi News home page

హీరో తల్లిగా మీనా..!

Aug 12 2017 11:54 AM | Updated on Aug 3 2019 12:45 PM

హీరో తల్లిగా మీనా..! - Sakshi

హీరో తల్లిగా మీనా..!

జయ జానకి నాయక సినిమాతో మంచి విజయం సాధించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన నెక్ట్స్ సినిమాను కూడా వేగంగా

జయ జానకి నాయక సినిమాతో మంచి విజయం సాధించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన నెక్ట్స్ సినిమాను కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు శ్రీవాసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాలో హీరో తల్లిగా ఓ అందాల తార నటించనుంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. తరువాత టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన మీనా, శ్రీవాస్, బెల్లంకొండ సినిమాలో హీరోగా తల్లిగా నటిస్తోంది. అయితే హీరో చిన్నప్పటి సీన్స్ వరుకు మాత్రమే మీనా కనిపిస్తుందా..? లేక సినిమా అంత కనిపిస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరో తల్లి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. కీలకమైన ఆ సీన్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement