కొత్త లుక్‌ కోసం తారక్‌... | Jr NTR Sweats It Out For His Film | Sakshi
Sakshi News home page

Apr 6 2018 12:34 PM | Updated on Apr 6 2018 5:39 PM

Jr NTR Sweats It Out For His Film - Sakshi

లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కష్టపడుతున్న జూనియర్ ఎన్టీఆర్‌

జై లవ కుశ సినిమాతో ఆకట్టుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లుక్‌ లో కనిపించేందుకు చాలా రోజులుగా జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కసరత్తులకు సంబంధించిన వీడియోలు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన ఫొటో సామాజిక్‌ మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది.

కొత్త సినిమాలో విభిన్నంగా కనిపించేందుకు ఎన్టీఆర్ ఎంత కష్టపడుతున్నాడు ఈ ఫొటోలో తెలుస్తుంది. హాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో ఎన్టీఆర్‌ కసరత్తులు చేస్తున్న ఫొటోను అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. పర్ఫెక్ట్ లుక్‌ కోసం ఎంతో నొప్పిను బరిస్తూ ఎన్టీఆర్‌ కష్టపడుతున్నాడు. ఈ ఫొటో చూసిన జూనియర్‌ అభిమానులు గర్వంగా ఫీల్‌ అవుతున్నారు. థ్రిల్లర్‌ జానర్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే, అను ఇమ్మాన్యూల్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement