2.0లో నేను రోబోను కాదు..! | I do not play a robot in Shankar 2.0 | Sakshi
Sakshi News home page

2.0లో నేను రోబోను కాదు..!

Feb 27 2016 12:10 PM | Updated on Sep 3 2017 6:33 PM

2.0లో నేను రోబోను కాదు..!

2.0లో నేను రోబోను కాదు..!

శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ సినిమాలో వరుసగా రెండో సారి ఛాన్స్ కొట్టేసిన బ్రిటీష్ బ్యూటి అమీ జాక్సన్, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ విజయ్ సరసన హీరోయిన్గా...

శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ సినిమాలో వరుసగా రెండోసారి ఛాన్స్ కొట్టేసిన బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ విజయ్ సరసన హీరోయిన్గా నటిస్తున్న తేరి సినిమా ప్రమోషన్లో భాగంగా అభిమానులతో ముచ్చటించిన అమీ, రోబో సీక్వల్లో తన పాత్రకు సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.

మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా రోబో 2లో తనది రోబో పాత్ర కాదన్న అమీ, తను చేయబోయే పాత్ర గురించి ఇప్పుడే ఎలాంటి సమాచారం ఇవ్వలేనని తెలిపింది. అంతేకాదు తన అభిమాన నటులు రజనీకాంత్, అక్షయ్ కుమార్లతో ఒకే సినిమాలో కలిసి నటించటం, శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ సినిమాలో రెండోసారి ఛాన్స్ సాధించటం చాలా ఆనందంగా ఉందని తెలిపింది అమీ.

Advertisement
 
Advertisement
Advertisement