రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట | high court stays cases on ramgopal varma | Sakshi
Sakshi News home page

రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట

Sep 17 2014 4:07 PM | Updated on Aug 31 2018 8:53 PM

రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట - Sakshi

రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుల మీద హైకోర్టు స్టే విధించింది.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుల మీద హైకోర్టు స్టే విధించింది. వినాయకుడి మీద తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్మ మీద కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఒక్క హైదరాబాద్లోనే పలు పోలీసు స్టేషన్లలో ఆయన మీద కేసులు పెట్టారు.

రాంగోపాల్ వర్మ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని, అవి బాధ్యతారహితంగా ఉన్నాయంటూ మహారాష్ట్రలో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరకు హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆయనకు కొద్దిపాటి ఊరట లభించినట్లయింది.

Advertisement
 
Advertisement
Advertisement