ఆమె పాత్రలో నటించాలనదే నా కోరిక.. | Heroien Manisha Koirala Acts In Indira Gandhi Biopic | Sakshi
Sakshi News home page

Jun 21 2018 11:15 AM | Updated on Jun 21 2018 12:21 PM

Heroien Manisha Koirala Acts In Indira Gandhi Biopic - Sakshi

మనీషా కొయిరాలా

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బయోపిక్‌లో బాలీవుడ్‌ హీరోయిన్‌ మనీషా కొయిరాలా నటిస్తారనే వార్తలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 16 సంవత్సరాలు క్రితం  ఇందిరాగాంధీ బయోపిక్‌లో నటించడానికి మనీషా సంతాకం చేసినట్లు సమాచారం. ఇందిరాగాంధీ బయోపిక్‌లో నటించాలని ఉందని మనీషా తాజాగా ఓ ఇంటార్యూలో చెప్పారు. ‘ఆమె చాలా శక్తివంతమైన మహిళ. తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆమె ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. అంతటి పవర్‌ఫుల్‌ లేడీ పాత్రలో నటించాలనదే నా కోరిక’ అని ఆమె పేర్కొన్నారు.

ఆమె పాత్రలో నటించాడం నాకు చాలా ఇష్టమని మనీషా తెలిపారు. అంతేకాక గతంలో ఈ బయోపిక్‌ కోసం సంతాకం చేసిన విషయాన్ని ఆమె మరొసారి గుర్తు చేశారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ ఎన్‌ చంద్ర తెరకెక్కిస్తున్నారు. మనీషా ప్రస్తుతం సంజయ్‌ దత్‌ బయోపిక్‌లో నర్గిస్ దత్ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఇందిరాగాంధీ పాత్రలో నటించాలని ఉందని మనీషా కొయిరాలా వెల్లడించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement