అనుష్క ఎక్స్‌లెన్స్‌ | dda52 Winners Meet Bollywood Diva Anushka Sharma | Sakshi
Sakshi News home page

అనుష్క ఎక్స్‌లెన్స్‌

Apr 11 2018 1:20 AM | Updated on Apr 3 2019 6:34 PM

dda52 Winners Meet Bollywood Diva Anushka Sharma - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ అటు నటిగా, ఇటు నిర్మాతగా వరుస హిట్స్‌తో దూసుకెళుతున్నారు. ‘దాదాసాహెబ్‌ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో ప్రతి ఏటా బహూకరించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ ఈ ఏడాది అనుష్కని వరించబోతోంది. తన సోదరుడు కర్నేష్‌ శర్మతో కలిసి ‘క్లీన్‌ స్లేట్‌ ఫిలింస్‌’ బ్యానర్‌ను స్థాపించిన అనుష్క ప్రేక్షకులు మెచ్చే చిత్రాలను నిర్మించారు. చిన్న వయసులోనే ప్రొడక్షన్‌ స్థాపించి పలు అర్థవంతమైన, చక్కటి వినోదాత్మక సినిమాలను ప్రేక్షకులకు అందించినందుకు ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

కొత్త నటులకు అవకాశం ఇస్తూ మరో మూడు సినిమాలు నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారామె. ఇటీవలే ‘పరి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు అనుష్క. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ఫౌండేష¯Œ  వారు ఆమెను ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు 2018’తో సత్కరించాలని నిర్ణయించారట. అవార్డు ప్రదానోత్సవం ఎప్పుడు అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అనుష్కా శర్మ ప్రస్తుతం వరుణ్‌ ధావన్‌తో ‘సూయీ ధాగా’, షారుక్‌ఖాన్‌తో ‘జీరో’ చిత్రాల్లో నటిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement