నాకు ప్రతి రోజూ ప్రత్యేకమే: రేఖ | Bollywood diva Rekha turns 60 | Sakshi
Sakshi News home page

నాకు ప్రతి రోజూ ప్రత్యేకమే: రేఖ

Oct 10 2014 4:12 PM | Updated on Apr 3 2019 6:23 PM

నాకు ప్రతి రోజూ ప్రత్యేకమే: రేఖ - Sakshi

నాకు ప్రతి రోజూ ప్రత్యేకమే: రేఖ

నిన్నటితరం బాలీవుడ్ అందాల తార, రాజ్యసభ సభ్యురాలు రేఖ 61వ ఏట అడుగుపెట్టారు.

ముంబై: నిన్నటితరం బాలీవుడ్ అందాల తార, రాజ్యసభ సభ్యురాలు రేఖ 61వ ఏట అడుగుపెట్టారు. శుక్రవారం ఆమె పుట్టినరోజు. కాగా రేఖ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం లేదని చెప్పారు. ప్రతి రోజూ తనకు ప్రత్యేకమేనని అన్నారు.

ప్రతి రోజు గుడికి వెళ్తానని రేఖ చెప్పారు. కొందరు పుట్టినరోజు లేదా పండగలకు ప్రాధానమెందుకిస్తారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ప్రతిరోజూ వేడకలాంటిదేనని భావిస్తానని, విభిన్నంగా జీవించడానికి ప్రయత్నిస్తానని రేఖ అన్నారు. 1970, 80లలో రేఖ పలు బాలీవుడ్ హిట్ చిత్రాల్లో నటించారు. గత నాలుగు దశాబ్దాలుగా రేఖ 180 చిత్రాల్లో నటించారు. రేఖ తల్లిదండ్రులు తమిళ నటులు జెమినీ గణేశన్, పుష్పవల్లి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement