ఒక పోస్టర్‌.. నాలుగు సినిమాలు | Bhoomi Movie Director Clarified about Copy Poster | Sakshi
Sakshi News home page

ఒక పోస్టర్‌.. నాలుగు సినిమాలు

Aug 13 2017 2:01 PM | Updated on Sep 17 2017 5:29 PM

ఒక పోస్టర్‌.. నాలుగు సినిమాలు

ఒక పోస్టర్‌.. నాలుగు సినిమాలు

ఒక కొత్త సినిమా పోస్టర్‌ రిలీజ్ అయ్యిందంటే.. అందులో హైలెట్ అయ్యే అంశాలనే కాదు.. లోపాలు వెతికి మరీ సోషల్‌ మీడియాలో పెట్టేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది.

ముంబై: ఒక కొత్త సినిమా పోస్టర్‌ రిలీజ్ అయ్యిందంటే.. అందులో హైలెట్ అయ్యే అంశాలనే కాదు.. లోపాలు వెతికి మరీ సోషల్‌ మీడియాలో పెట్టేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్‌ కొత్త సినిమా భూమి విషయంలోనూ ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఈ మధ్యే చిత్ర ఫస్ట్ లుక్‌తోపాటు ట్రైలర్‌ రిలీజ్ చేశారు. చాలా కాలం తర్వాత భాయ్‌ నుంచి వస్తున్న సినిమా కావటం, ట్రైలర్ కూడా అందుకు తగ్గట్లే ఉండటంతో అభిమానులు పండగ చేసుకున్నారు.

అయితే పోస్టర్‌ హాలీవుడ్ చిత్రం ది గ్రే(2012) నుంచి కాపీకొట్టారంటూ విమర్శలు చెలరేగాయి. దీనిపై చిత్ర మేకర్‌ అనుభవ్‌ సిన్హా తన ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ వివరణే ఇచ్చుకున్నారు. అయితే అది కాపీ ఏం కాదని, గతంలో ఇలాంటి పోస్టర్లు హాలీవుడ్‌లో చాలానే వచ్చాయంటూ కొన్ని పాత హాలీవుడ్ సినిమా పోస్టర్లు పంచుకోగా ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. లోగన్‌, ఫ్రీ స్టేట్‌ ఆఫ్‌ జోన్స్, గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్ పోస్టర్లు కూడా అదే మాదిరిగా ఉన్నాయని, అంత మాత్రానా ఇలా పోలుస్తూ తప్పుబట్టడం సరికాదన్నది విశ్లేషకుల వాదన.




Advertisement
 
Advertisement
Advertisement