ఊర మాస్‌గాడు! | Allu Arjun's 'Sarrainodu' to release on April 22 | Sakshi
Sakshi News home page

ఊర మాస్‌గాడు!

Feb 27 2016 11:49 PM | Updated on Sep 3 2017 6:33 PM

ఊర మాస్‌గాడు!

ఊర మాస్‌గాడు!

ఒక్క డైలాగ్ చాలు.. హీరో పాత్ర ఎలా ఉంటుందో చెప్పేయడానికి. ఆ మధ్య విడుదలైన ‘సరైనోడు’

ఒక్క డైలాగ్ చాలు.. హీరో పాత్ర ఎలా ఉంటుందో చెప్పేయడానికి. ఆ మధ్య విడుదలైన ‘సరైనోడు’ టీజర్‌లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఈ చిత్రంలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పేసింది. ‘ఎర్ర తోలు కదా.. స్టైల్‌గా ఉంటాడను కుంటున్నావేమో.. మాస్ ఊర మాస్..’ అంటూ సీరియస్ లుక్‌తో బన్నీ చెప్పిన డైలాగ్‌కి అభిమానులు ఆనందపడిపోయారు. అసలే బన్నీ మాస్ హీరో.
 
 ఇక, బోయపాటి శ్రీను వంటి మాస్ డెరైక్టర్‌తో సినిమా చేస్తే? ఊర మాస్‌గానే ఉంటుంది కదూ. అందుకే ‘సరైనోడు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ నాయకా నాయికలుగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ఏప్రిల్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని శనివారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
 
 ఇటీవల ఈ చిత్రం కోసం బన్నీ, కేథరిన్ పాల్గొనగా ఓ పాట చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని టాకీ సన్నివేశాలు తీస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ పాటలు స్వరపరిచారు. బన్నీ ఓ పాట పాడిన విషయం తెలిసిందే. మార్చి నెలాఖరున పాటలను విడుదల చేయాలని అనుకుంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement