అజిత్ ఔదార్యం | Ajit magnanimity | Sakshi
Sakshi News home page

అజిత్ ఔదార్యం

Mar 28 2014 1:27 AM | Updated on Oct 9 2018 7:32 PM

అజిత్ ఔదార్యం - Sakshi

అజిత్ ఔదార్యం

నటుడు అజిత్ గుప్తదానాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. తన పేరిట ఏర్పాటయిన అభిమాన సంఘం ద్వారా పేదలకు తన వంతు సాయం అందజేస్తున్నారు.

నటుడు అజిత్ గుప్తదానాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. తన పేరిట ఏర్పాటయిన అభిమాన సంఘం ద్వారా పేదలకు తన వంతు సాయం అందజేస్తున్నారు. మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాల ఏర్పాటు, సంక్షేమ సహాయకాల పంపిణీ వంటివి చేపట్టారు. అభిమాన సంఘాన్ని తొలగించి తానే స్వయంగా సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. షూటింగ్‌లోనూ సహ కళాకారులకు వైద్య సాయం చేస్తున్నారు.
 
  బిర్యానీ తయారు చేసి అందరికీ వడ్డిస్తున్నారు. ప్రస్తుతం తన వద్ద పని చేసే 12 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఇది వరకే వీరికి ఇళ్లు నిర్మించేందుకు చెన్నై సమీపంలోని కేళంబాక్కంలో స్థలాన్ని కొనుగోలు చేశారు. దాన్ని 12 మందికి విభజించి ఇచ్చారు. ఇళ్లు నిర్మించేందుకు పెద్ద మొత్తం అవసరం కావడంతో వారు నిర్మించుకోలేకపోయారు. ప్రస్తుతం అజిత్ తన  సొంత ఖర్చుతో ఇళ్లు నిర్మించి వారి పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. అజిత్ సేవలను సహ నటులు అభినందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement