బెల్లంకొండ కోసం బాలీవుడ్ హీరోయిన్ | Abhishek picture, Sriwass first schedule started in RFC | Sakshi
Sakshi News home page

బెల్లంకొండ కోసం బాలీవుడ్ హీరోయిన్

Jun 13 2017 1:54 PM | Updated on Aug 3 2019 12:45 PM

బెల్లంకొండ కోసం బాలీవుడ్ హీరోయిన్ - Sakshi

బెల్లంకొండ కోసం బాలీవుడ్ హీరోయిన్

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో యాక్షన్ ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ్ శ్రీనివాస్, ఆ సినిమా సెట్స్

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో యాక్షన్ ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ్ శ్రీనివాస్, ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించాడు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ జగపతిబాబు, రవికిషన్, మధు గురుస్వామి (కన్నడ నటుడు) విలన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన భారీ సెట్ లో ప్రారంభమైంది.  

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. ''డిక్టేటర్' తరువాత నా దర్శకత్వంలో తెరకెక్కనున్న 6వ చిత్రమిది. ఒక డిఫరెంట్ జోనర్లో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా సరికొత్త రీతిలో ప్రెజంట్ చేయనున్నాను. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా.. టెక్నికల్గా స్ట్రాంగ్గా రూపొందించనున్నాం. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యం వహించనుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ పీటర్ హైన్స్ ఫైట్స్ను డిజైన్ చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. ఈ రోజు నుంచి(మంగళవారం) రామోజీ ఫిలిమ్ సిటీలో రెగ్యులర్ షూట్ ప్రారంభించాం. తర్వాత ఒక మేజర్ షెడ్యూల్ ను ఫారిన్లో ప్లాన్ చేస్తున్నాం. ఓ బాలీవుడ్ హీరోయిన్ను బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాం' అన్నారు.

అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ.. 'శ్రీవాస్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడం, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా నిర్మించాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉండడం.. ఇప్పుడు ఈ ప్రోజెక్ట్ ఇలా సెట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. కథకి తగినట్లుగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్ను వేశాం.  బెల్లంకొండ శ్రీనివాస్తోపాటు శ్రీవాస్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది.' అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement