జాతీయ అవార్డుల బరిలో40 చిత్రాలు
జాతీయ అవార్డుల కోలాహలం మొదలవుతోంది. ఈ అవార్డుల బరిలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 40 తమిళ చిత్రాలు దిగుతున్నాయి.
జాతీయ అవార్డుల కోలాహలం మొదలవుతోంది. ఈ అవార్డుల బరిలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 40 తమిళ చిత్రాలు దిగుతున్నాయి. 61వ జాతీయ అవార్డుల ఎంపిక చిత్రాల జాబితా మే లో విడుదల కానుంది. గత ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలకు జాతీయ అవార్డుల నామినేషన్‌కు అర్హత ఉంటుంది. ఈ ఏడాది వివిధ కేటగిరిలకు 40 తమిళ చిత్రాలు నామినేషన్‌కు వెళ్లడం విశేషం.
జాతీయ అవార్డులకు మొత్తం 30 కేటగిరీలు ఉంటాయి. వీటికి గాను తమిళ చిత్రాలు 6 మెళుగవత్తిగళ్, ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్, హరిదాస్, మరియాన్, మూడర్ కూటం, ఓనాయుం ఆట్టుకుట్టియుం, పణ్ణైయారుం పద్మినియుం, తంగమీన్‌గళ్, విడియుంమున్ తదితర చిత్రాలు పోటీ పడుతున్నాయి. అంతేకాకుండా కమర్షియల్‌గా విజయం సాధించిన చిత్రాల పట్టికలో గోలీసోడా, ఎదిర్‌నీచ్చల్, కుట్టిపులి, పాండియనాడు, రాజారాణి, సూదుకవ్వుం చిత్రాలు చోటు చేసుకున్నాయి. అదే విధంగా త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఇనం, నెడుంశాలై, రామానుజన్ వంటి చిత్రాలు కూడా జాతీయ అవార్డుల పోటీలో ఉండటం విశేషం. ఈసారి కోలీవుడ్ ఎన్ని జాతీయ అవార్డులను గెలుచుకుంటుందో వేచి చూడాల్సిందే.