ఒక్క సీన్ కూడా మిస్‌ అవకుండా! | theatere designed for childrens | Sakshi
Sakshi News home page

ఒక్క సీన్ కూడా మిస్‌ అవకుండా!

Mar 17 2017 4:23 AM | Updated on Aug 13 2018 4:19 PM

ఒక్క సీన్ కూడా మిస్‌ అవకుండా! - Sakshi

ఒక్క సీన్ కూడా మిస్‌ అవకుండా!

చిన్నపిల్లలతో సినిమాకెళ్తే.. పెద్దలు పడే కష్టాలు.. అనుభవించినోళ్లకే తెలుస్తాయ్‌.

వాషింగ్టన్: చిన్నపిల్లలతో సినిమాకెళ్తే.. పెద్దలు పడే కష్టాలు.. అనుభవించినోళ్లకే తెలుస్తాయ్‌..  పిల్లలు అది కావాలి.. ఇది కావాలి అంటూ గోల.. అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.. సినిమాను సరిగా చూడనివ్వరు.. దాదాపు అందరూ ఇలాంటి సీన్లను ఎదుర్కొనే ఉంటారు. ఇదిగో అమెరికా.. కాలిఫోర్నియా రాష్ట్రంలోని పికో రివెరా సిటీలో కట్టిన ఈ సినీపోలిస్‌ థియేటర్లో పెద్దలకు అలాంటి గోల ఉండదు. పిల్లలతో సినిమాకెళ్లినా.. సినిమా మొత్తం ఒక్క సన్నివేశం కూడా మిస్‌ కాకుండా చూసి రావొచ్చు.

ఇక్కడ పిల్లల వయసుకు తగ్గట్లుగా రకరకాల ఏర్పాట్లు చేశారు. ధియేటర్‌ ముందుభాగంలో పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా ఉంటుంది. వాళ్ల పని వాళ్లది మన పని మనది. దీంతోపాటు తల్లిదండ్రుల ఒళ్లో కూర్చుని సినిమా చూసే విధంగానూ ఏర్పాట్లు చేశారు. బాగుంది కదూ..

Advertisement
 
Advertisement
Advertisement